Pavan Kalyan: పవన్ కల్యాణ్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల?

Sreeleela in Pavan Movie

  • నలుగురు యంగ్ హీరోల జోడీగా శ్రీలీల
  • 'ధమాకా'తో హిట్ ను సొంతం చేసుకున్న బ్యూటీ 
  • సీనియర్ హీరో జోడీగాను మెప్పించిందని ప్రశంసలు 
  • పవన్ సినిమా కోసం సుజిత్ ఎంపిక చేశాడని టాక్    

శ్రీలీల .. చందమామ వంటి ఫేస్. చూడగానే అందగత్తెనే అనిపించే ఆకర్షణీయమైన రూపం. అభినయం ఓకే .. డాన్స్ కి వంకబెట్టవలసిన అవసరం లేదు. యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. అందువల్లనే ఆమెను తీసుకోవడానికి టాలీవుడ్ మేకర్స్ పోటీపడుతున్నారు.

ఇప్పటికే ఆమె రామ్ .. నితిన్ .. వైష్ణవ్ తేజ్ .. శర్వానంద్ సినిమాలతో బిజీగా ఉంది. ఇక తాజాగా ఆమెకి పవన్ సినిమాలో ఛాన్స్ లభించిందనే టాక్ కాస్త బలంగానే వినిపిస్తోంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' చేస్తున్న పవన్, ఆ తరువాత చేయడానికిగాను రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. 

ఆ రెండు సినిమాల్లో ఒకటి 'సాహూ' దర్శకుడు సుజిత్ తో చేయనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేశారని అంటున్నారు. రవితేజ జోడీగా 'ధమాకా'లో ఆమె మెప్పించిన తీరు చూసిన తరువాతనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.

Pavan Kalyan
Sujeeth
Sreeleela
  • Loading...

More Telugu News