Narendra Modi: మమతా దీదీకి జన్మదిన శుభాకాంక్షలు: మోదీ

Modi birthday wishes to Mamata Banerjee

  • నేడు 68వ పడిలోకి అడుగుపెట్టిన మమత
  • ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించిన మోదీ
  • శుభాకాంక్షలు తెలిపిన శరద్ పవార్, స్టాలిన్ తదితరులు

నేడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జన్మదినం. ఈరోజుతో ఆమె 68వ పడిలోకి అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలో రాజకీయాలను పక్కన పెట్టి ఆమెకు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. 'మమతా దీదీకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా శుభాకాంక్షలు తెలిపారు. కామాక్షి అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా దీదీకి గ్రీటింగ్స్ తెలియజేశారు.

Narendra Modi
Mamata Banerjee
BJP

More Telugu News