Chandrababu: పెద్దూరులో ఇంటింటికీ చంద్రబాబు పాదయాత్ర

Chandrababu padayatra

  • చంద్రబాబు కుప్పం షోను అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం
  • జగన్ ఇంటికి పోవడం ఖాయమన్న బాబు

కుప్పం పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ర్యాలీకి అనుమతి లేదని వారు ఆయనను నిలువరించారు. ఈ సందర్భంగా పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఆపుతారా? అని ప్రశ్నించారు. అనంతరం ఆయన పాదయాత్రగా బయల్దేరారు. పెద్దూరు గ్రామంలో ఆయన పాదయాత్రగా నడుస్తున్నారు. 

మరోవైపు ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంచాలని.. జగన్ నియంతృత్వ ధోరణిని, ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఎన్నికల తర్వాత జగన్ ఇంటికి పోతాడని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. సభలు, ర్యాలీలను నిర్వహించకుండా ఏ చట్టం ప్రకారం జీవో1ని తెచ్చారో చెప్పాలని చంద్రబాబు అడిగారు. ఇది ప్రజలు, ప్రజాస్వామ్యం గొంతుకను నొక్కడమేనని... ఇలాంటివాటిని సాగనివ్వబోనని అన్నారు. తన రోడ్డు షోలపై ఏ చట్టం కింద పోలీసులు అభ్యంతరం చెపుతున్నారని ప్రశ్నించారు.

Chandrababu
Telugudesam
YSR
Jagan

More Telugu News