Chiranjeevi: 'మెగా' కథపైనే పూరి కసరత్తు!

Chiranjeevi and Puri Combo

  • 'లైగర్' రిజల్టుతో దెబ్బతిన్న పూరి 
  • చిరూతో చెయ్యడానికి సన్నాహాలు 
  • శరవేగంగా రెడీ అవుతున్న కథ
  • ఈ లోగా 'భోళా శంకర్' పూర్తి చేయనున్న మెగాస్టార్  

పూరి జగన్నాథ్ పడిపోయిన ప్రతిసారి లేచి నిలబడుతూనే ఉన్నాడు. ఆయన పనైపోయిందని అనుకున్నవారికి హిట్ తో సమాధానం చెబుతూనే వస్తున్నాడు. అలాంటి పూరి జగన్నాథ్ ని 'లైగర్' సినిమా బాగానే ఇబ్బంది పెట్టింది. అయినా ఆ షాక్ నుంచి కూడా ఆయన త్వరగానే కోలుకున్నాడు. మెగాస్టార్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. 

గతంలో చిరంజీవితో ఆయన 'ఆటోజాని' చేయాలనుకున్నాడుగానీ కుదరలేదు. ఆ మధ్య చిరంజీవి ఆ సినిమా గురించి ప్రస్తావిస్తే, అంతకంటే మంచి కథతో వస్తానని పూరి చెప్పాడు. అలాంటి కథ కోసం తాను వెయిట్ చేస్తూ ఉంటానని చిరంజీవి అన్నారు. ఆ తరువాతనే చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో పూరి జర్నలిస్ట్ పాత్రను చేశాడు. 

చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' ఈ నెల 13వ తేదీన థియేటర్లకు రానుంది. ఆ తరువాత ఆయన చేతిలో ఉన్నది 'భోళా శంకర్' మాత్రమే. మరో ప్రాజెక్టును మెగాస్టార్ ఒప్పుకోలేదు. అందుకు కారణం పూరితో చేయాలనీ ఆయన ఫిక్స్ కావడమే అనే టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన కథపైనే పూరి కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు..

Chiranjeevi
Puri Jagannadh
Tollywood
  • Loading...

More Telugu News