Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూ ఏమైనట్టు?

sampoornesh Babu Special

  • ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చిన సంపూ
  • హాస్య కథానాయకుడిగా తనదైన ముద్ర 
  • హీరో వేషాలతోను .. ముఖ్యమైన పాత్రల్లోను మెప్పించిన తీరు 
  • కొంతకాలంగా ఎక్కడా కనిపించని సంపూ  

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, హీరో అనిపించుకున్నవారిలో సంపూర్ణేశ్ బాబు ఒకరుగా కనిపిస్తాడు. చాలా క్రింది స్థాయి నుంచి వచ్చిన ఆయన హాస్య నటుడిగా తనదైన ముద్ర వేశాడు. స్పూఫ్ కామెడీ చేయడంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు.

ఒక వైపున హీరోగా చేస్తూ .. మరో వైపున ఇతర హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. ఆయన చేసిన 'కొబ్బరిమట్ట'కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత చేసిన 'బజార్ రౌడీ' .. 'క్యాలీ ఫ్లవర్' సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను నవ్వించలేకపోయాయి. 

'చోర్ బజార్' లో కనిపించాడుగానీ, ఆ సినిమా ఆడకపోవడం వలన ఆ పాత్రను ఎవరూ గుర్తుపెట్టుకోలేదు. అప్పటి నుంచి కూడా ఎక్కడా సంపూ కొత్త ప్రాజెక్టుల సందడి కనిపించడం లేదు. ముఖ్యమైన పాత్రల జాబితాలోను ఆయన పేరు ఎక్కడా కనిపించడం లేదు. ఆయన మాట ఎక్కడా వినిపించడం లేదు. 

 సక్సెస్ లు .. ఫ్లాపుల సంగతి అలా ఉంచితే, ఆయన వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లేవాడు.  తక్కువ బడ్జెట్లో సినిమాలు చేస్తూ .. పెద్ద హిట్లు ఇస్తూ వెళుతున్న సంపూ చేతిలో, కొత్త ప్రాజెక్టులు కనిపించకపోవడం ఆశ్చర్యమే.  

Sampoornesh Babu
Comedian
Tollywood
  • Loading...

More Telugu News