GVL Narasimha Rao: ఏ ముఖం పెట్టుకుని ఏపీకి కేసీఆర్ వస్తున్నారు?: జీవీఎల్ నరసింహారావు

GVL Narasimha Rao fires on KCR

  • తెలంగాణ నుంచి ఆంధ్రులను తరిమికొడతానని కేసీఆర్ అన్నారన్న జీవీఎల్
  • ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్య

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ కార్యకలాపాలను విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిని ఆయన నియమించారు. మరోవైపు, కేసీఆర్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ నుంచి ఆంధ్రులను తరిమికొడతానన్న కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని పెట్టుకుని ఏపీకి వస్తారని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాష్ట్రంలోకి అడుగుపెట్టాలని అన్నారు. 

ఆంధ్రకు కేసీఆర్ చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోరని జీవీఎల్ అన్నారు. ఆంధ్ర పార్టీలు, ఆంధ్ర నాయకులు వద్దన్న కేసీఆర్ కు ఏపీలో ఏం పని? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించిన కేసీఆర్ ఏపీలో అధికారంలోకి వస్తే పోలవరంను పూర్తి చేస్తామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం డ్యామ్ నీళ్లను సముద్రంపాలు చేసిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. తెలంగాణలో సైతం బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని అన్నారు.

GVL Narasimha Rao
BJP
KCR
BRS
  • Loading...

More Telugu News