dubai: దుబాయ్ లో మద్యం ప్రియులకు కిక్ ఇచ్చిన ప్రభుత్వ నిర్ణయం!

30 percent tax on liquor has been lifted indubai
  • మద్యం విక్రయాలపై నిబంధనల సడలింపు
  • మద్యంపై 30 శాతం పన్ను ఎత్తివేత
  • పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు
దుబాయ్, అబుదాబి లాంటి గల్ఫ్ దేశాలు పర్యాటకులకు స్వర్గధామంగా మారాయి. చమురుతో పాటు పర్యాటక రంగంతోనే ఆ దేశాలకు భారీ ఆదాయం సమకూరుతోంది. అయితే, ఎన్నో సౌకర్యాలు ఉండే అరబ్ దేశాలకు టూరిస్టులు క్యూ కడుతున్నా.. అక్కడి కఠినమైన చట్టాలు, ఇస్లామిక్ నిబంధనల వల్ల వారికి కొంత అసౌకర్యం ఏర్పడుతోంది. దీన్ని గ్రహించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రమంగా నిబంధనలు సడలిస్తూ వస్తోంది. దీనికితోడు ఆర్థికాభివృద్ధికి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు మద్యం విక్రయాలపై నిబంధనలు సడలించింది. మద్యంపై విధిస్తున్న 30 శాతం పన్ను కూడా ఎత్తేసింది.

 గతంలో అరబ్ దేశాల్లో ఇంట్లో మద్యం సేవించాలన్నా కొంత డబ్బు చెల్లించి వ్యక్తిగత లైసెన్స్  తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మద్యం విషయంలో చట్టాలను సవరిస్తూ జనవరి 1న దుబాయ్ రాజ కుటుంబం ఈ ప్రకటన చేసింది. విదేశీ పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు మద్యంపై ట్యాక్స్ తగ్గించింది. దుబాయ్ చట్టాల ప్రకారం.. ముస్లింలు మద్యం తాగడానికి వీల్లేదు. ఇతరులు మద్యం సేవించాలంటే వీసా కలిగి, 21 ఏళ్లు దాటిన వారై ఉండాలి. కానీ, ఇప్పుడు ఈ చట్టాలను సవరించడంతో పాటు మద్యం ధరలు కూడా తగ్గించింది. దాంతో, విదేశీ పర్యాటకులకు ఊరట కలుగుతుందని గల్ఫ్ దేశం భావిస్తోంది.
dubai
uae
arab emirates
liquor
sales
tourists

More Telugu News