Daggubati Suresh Babu: జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ కంట్రోల్ చేసిన సినీ నిర్మాత సురేశ్ బాబు.. వీడియో వైరల్

Producer Suresh Babu clears traffic in Film Nagar

  • ఫిల్మ్ నగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
  • కారు దిగి ట్రాఫిక్ ను నియంత్రించిన సురేశ్ బాబు
  • సురేశ్ బాబుపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

హైదరాబాద్ లో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి రోజు వందలాది కొత్త వాహనాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. దీంతో, ట్రాఫిక్ సమస్యలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో, అటువైపు వెళ్తున్న ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు తన కారు నుంచి కిందకు దిగి ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు. వాహనదారులకు సూచనలు చేస్తూ ట్రాఫిక్ ను నియంత్రణలోకి తీసుకొచ్చారు. 

సాక్షాత్తు ఒక సినీ ప్రముఖుడు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తుండటం వాహనదారులను ఆకట్టుకుంది. ఈ సన్నివేశాన్ని వారు తమ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు సురేశ్ బాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాధ్యతగల పౌరుడిగా వ్యవహరించారని ప్రశంసిస్తున్నారు.

Daggubati Suresh Babu
Tollywood
Traffic

More Telugu News