Andhra Pradesh: ఉత్తర కోస్తాలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు!

Light to Moderate Rains in Coastal Andhra today
  • ఒకేసారి చలి, తేమ గాలులు
  • వాతావరణంలో అనిశ్చితి కారణంగానే వర్షాలు
  • వచ్చే రెండు రోజుల్లో స్వల్పంగా పెరగనున్న చలి
ఉత్తర కోస్తాలోని పలు చోట్ల నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో మాత్రం వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. ఉత్తర భారతదేశం నుంచి మధ్య భారతం మీదుగా ఉత్తర కోస్తా వరకు చలి గాలులు వీస్తున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమ గాలులు వీస్తున్నాయి.

ఒకేసారి చలి, తేమ గాలులు వీస్తుండడంతో వాతావరణంలో అనిశ్చితి నెలకొందని, వర్షాలకు అదే కారణమని అధికారులు తెలిపారు. అలాగే, వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలో చలి స్వల్పంగా పెరుగుతుందని పేర్కొన్నారు.
Andhra Pradesh
Coastal Andhra
Moderate Rains
Rayalaseema

More Telugu News