Sunil Kumar: సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు డీజీపీ హోదాతో ప్రమోషన్

CID Chief Sunil Kumar gets promotion with DGP rank

  • ఇప్పటివరకు అడిషనల్ డీజీగా ఉన్న సునీల్ కుమార్
  • పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
  • ఇకపై డీజీపీ హోదాతో సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్

సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు నూతన సంవత్సరం ముంగిట ఏపీ ప్రభుత్వం తియ్యని కబురు చెప్పింది. ఆయనకు డీజీపీ హోదాతో పదోన్నతి కల్పించింది. ఇప్పటివరకు సునీల్ కుమార్ అడిషనల్ డీజీపీ హోదాతో సీఐడీ చీఫ్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడాయనకు డీజీపీగా ప్రమోషన్ ఇచ్చారు. 

వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీ సీఐడీ విభాగం పేరు తరచుగా మీడియాలో వినిపిస్తోంది. ముఖ్యంగా, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో సునీల్ కుమార్ పేరు ఎక్కువగా వినిపించింది. సునీల్ కుమార్ వైఖరిపై రఘురామ కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. 

సునీల్ కుమార్ 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఇకపై ఆయన డీజీపీ ర్యాంకుతో సీఐడీ చీఫ్ గా కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన వేతన శ్రేణిని రూ.2,05,400-రూ.2,24,400గా పేర్కొన్నారు. పదోన్నతి 2023 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో వివరించారు. 

అటు, డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేశ్ దీక్షిత్, అమిత్ గార్గ్ లకు కూడా డీజీపీ హోదాతో ప్రమోషన్ కల్పించారు.

Sunil Kumar
CID Chief
DGP
Promotion
Additional DGP
Andhra Pradesh
  • Loading...

More Telugu News