Kruthi Shetty: కృతి శెట్టి .. శ్రీలీల మధ్య గట్టి పోటీ ఉండే ఛాన్స్!

- ఈ ఏడాది ఆరంభంలో 'బంగార్రాజు'తో హిట్ కొట్టిన కృతి
- ఈ ఏడాది చివరిలో 'ధమాకా'తో హిట్ అందుకున్న శ్రీలీల
- గ్లామర్ .. యాక్టింగ్ .. డాన్సులలో ఇద్దరూ ఇద్దరే
- కొత్త ఏడాదిలో ఇద్దరి చేతుల్లోను పెద్ద ప్రాజెక్టులు
టాలీవుడ్ లో అడుగుపెడుతూనే కృతి శెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఫస్టు మూవీ 'ఉప్పెన' రిలీజ్ కాకముందే మరో రెండు సినిమాలు ఒప్పేసుకుంది. ఆ సినిమాలతో కలుపుకుని హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ఈ మధ్య కాలంలో ఒక కొత్త హీరోయిన్ హ్యాట్రిక్ హిట్ ను దక్కించుకోవడం కృతి శెట్టి విషయంలోనే జరిగింది. ఈ ఏడాదిలో ఆమె నుంచి నాలుగు సినిమాలు రాగా, 'బంగార్రాజు' మాత్రమే హిట్ అయింది.

