Dil Raju: రిస్క్ చేయడం వల్లే నేను ఈ స్థాయికి ఎదిగాను: దిల్ రాజు

Dil Raju Interview

  • ద్విభాషా చిత్రంగా 'వారసుడు' చేస్తున్న దిల్ రాజు 
  • ఆయన నిర్మాణంలోనే సెట్స్ పై ఉన్న శంకర్ సినిమా 
  • ఇప్పుడు సినిమా అనేది ఒక భాషకి .. ప్రాంతానికి పరిమితం కాదన్న దిల్ రాజు 
  • పాన్ ఇండియా సినిమాల విషయంలో రిస్క్ తప్పదని వ్యాఖ్య

టాలీవుడ్ అగ్రనిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఏ కథ ఏ వర్గం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనేది ఆయనకి బాగా తెలుసు. కథల విషయంలో ఆయన జడ్జిమెంట్ చాలావరకూ కరెక్టుగా ఉంటుందని అంటారు. అలాంటి దిల్ రాజు ఒక వైపున చరణ్ - శంకర్ కాంబినేషన్లో, మరో వైపున విజయ్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వందల కోట్ల బడ్జెట్లో సినిమాలు నిర్మిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ .. "టాలీవుడ్ నుంచి మాత్రమే పెద్ద సినిమాలు వస్తున్నాయనడం కరెక్టు కాదు. కన్నడ .. తమిళ భాషల్లోను పెద్ద సంస్థలు చాలానే ఉన్నాయి. వాళ్లంతా కూడా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. ఇప్పుడు సినిమా అనేది ఒక భాషకి .. ఒక ప్రాంతానికి పరిమితం కావడం లేదు" అన్నారు. 

" వందల కోట్ల బడ్జెట్ లో నేను సినిమాలు చేయడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. అయితే పాన్ ఇండియా సినిమాకి లెక్కలు వేస్తూ కూర్చోవడం కరెక్టు కాదు. రిస్క్  చేయడం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను. తెలుగు సినిమా ఎదిగింది .. దానితో పాటే నేను కూడా పెరిగాను. అందువల్లనే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News