Telugudesam: నెల్లూరులో నేటి నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదిగో

Chandrababu 3 day tour to Nellore begins today

  • ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరనున్న చంద్రబాబు
  • 4 నుంచి 5.15 వరకు కందుకూరులో రోడ్ షో
  • ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభ
  • రాత్రికి అక్కడే బస

వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా, నేటి నుంచి మూడు రోజులపాటు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. నేడు కందుకూరులో పర్యటించనుండగా, రేపు, ఎల్లుండి కావలి, కోవూరులో పర్యటించనున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆయన షెడ్యూల్ వివరాలను వెల్లడించాయి. 

ఈ ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరు నేతలు ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడ బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. 4 గంటలకు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని దివి కొండయ్య విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహిస్తారు. 4 గంటల నుంచి 5.15 వరకు వెంకటనారాయణ నగర్, అంబేద్కర్ విగ్రహం, పోస్టాఫీస్ సెంటర్ మీదుగా రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ ఉంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు.

Telugudesam
Chandrababu
Nellore District
Kandukur
Idem Kharma Rashtraniki
  • Loading...

More Telugu News