Chiranjeevi: వీరయ్యగా బాస్ డ్యాన్స్ పూనకాలు తెప్పిస్తుంది: శేఖర్ మాస్టర్

Waltair Veerayya Press Meet

  • 'వాల్తేరు వీరయ్య'గా చిరంజీవి
  • మెయిన్ సెట్లో నిర్వహించిన ప్రెస్ మీట్ 
  • ఈ సినిమాలో అన్ని సాంగ్స్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ 
  • అది తన అదృష్టమంటూ హర్షం  
  • జనవరి 13వ తేదీన విడుదలవుతున్న సినిమా  

చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబీ 'వాల్తేరు వీరయ్య' సినిమాను రూపొందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు. శ్రుతిహాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రవితేజ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రధానమైన సెట్ లోనే ప్రెస్ మీట్ ను నిర్వహించారు. 

ఈ వేదికపై శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ .. " ఒకప్పుడు నేను కూడా చిరంజీవిగారి సినిమాలను చొక్కాలు చింపుకుని చూసినవాడినే. ఈ రోజున ఆయన సినిమాకి అన్ని పాటలను చేసే ఛాన్స్ వచ్చింది. ఈ రోజుల్లో ఒక సినిమాకి అన్ని పాటలను కంపోజ్ చేసే అవకాశం ఎవరూ ఇవ్వరు. అలాంటిది చిరంజీవి గారు .. బాబీ గారు నాపై నమ్మకంతో ఇచ్చారు" అన్నాడు. 

" ఈ సినిమాలో ప్రతి పాటను దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భుతంగా కంపోజ్ చేశారు. ప్రతి పాట కూడా పూనకాలు తెప్పించడం ఖాయం. ఆయన ట్యూన్స్ గొప్పగా ఉండటం వల్లనే, నేను బాగా వర్క్ చేయగలిగాను. ఇక బాస్ డ్యాన్స్ గురించి చెప్పాలంటే అది వేరే లెవెల్. ఈ సెట్ చూస్తుంటే మరో పాట కూడా ఇక్కడే చేస్తే బాగుండునని అనిపిస్తోంది' అని చెప్పాడు.

Chiranjeevi
Sruthi Haasan
Waltair Veerayya Press Meet
  • Loading...

More Telugu News