Chiranjeevi: డాన్స్ విషయంలో చిరూ స్టైల్ ఇది .. బాలయ్య పద్ధతి అది: శేఖర్ మాస్టర్
- టాలీవుడ్ స్టార్ కొరియోగ్రఫర్ గా శేఖర్ మాస్టర్
- 'వాల్తేరు వీరయ్య' కోసం ఐదు పాటలను చేశానని వెల్లడి
- 'వీరసింహా రెడ్డి' కోసం రెండు పాటలను చేశానని వివరణ
- రెండు సినిమాలు ఒకేసారి రావడం అరుదైన విషయమని వ్యాఖ్య
టాలీవుడ్ లోని స్టార్ కొరియోగ్రఫర్స్ లో శేఖర్ మాస్టర్ ఒకరు. ఈ మధ్య కాలంలో ఆయా పాటలకు ఆయన అందించిన డాన్సులు బాగా పాప్యులర్ అయ్యాయి. ఇక తాజాగా ఆయన కొరియోగ్రఫీని అందించిన 'వాల్తేరు వీరయ్య' .. 'వీరసింహా రెడ్డి' సినిమాలు రెండూ కూడా సంక్రాంతికి భారీస్థాయిలో రిలీజ్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ .. "చిరంజీవిగారి 'వాల్తేరు వీరయ్య' సినిమాలో ఐదు పాటలకు నేనే కొరియోగ్రఫీని అందించాను. చిరంజీవిగారి గ్రేస్ ను దృష్టిలో పెట్టుకుని స్టెప్స్ కంపోజ్ చేయడం అంత తేలికైన విషయమేం కాదు. రెండు, మూడు వెర్షన్లు చేసి సార్ కి చూపిస్తాను. ఆయనకి నచ్చినదానితో సెట్స్ పైకి వెళతాను. సార్ నుంచి ఇన్ పుట్స్ ఉంటూనే ఉంటాయి" అన్నారు.
ఇక బాలయ్య సార్ విషయానికొస్తే, 'వీరసింహా రెడ్డి'లో రెండు పాటలకి పనిచేశాను. ఆయన ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో ఉంటారు. ఆయన నుంచి అభిమానులు కోరుకుంటున్నట్టుగా స్టెప్స్ కంపోజ్ చేయాలి. ఆయన స్టెప్స్ కి విజిల్స్ పడేలా కంపోజ్ చేయవలసి ఉంటుంది. బాలయ్యగారు మార్పులు .. చేర్పులు చెప్పరు. కానీ ఎలాంటి స్టెప్స్ అయినా వెనకాడకుండా చేస్తారు. నేను చేసిన భారీ సినిమాలు రెండూ ఒకేసారి రిలీజ్ అవుతూ ఉండటం నాలో మరింత ఆసక్తిని పెంచుతోంది" అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ మాస్టర్.