Kanna Lakshminarayana: సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన కన్నా లక్ష్మీనారాయణ

kanna fires on jagan

  • వైసీపీ ప్రభుత్వం చాక్లెట్ ఇచ్చి నిలువు దోపిడీ చేస్తోందన్న కన్నా 
  • పోలీసు వ్యవస్థని దిగజార్చారని విమర్శ 
  • ఎస్సీ కార్పొరేషన్ కింద 26 పథకాలను రద్దు చేశారని వ్యాఖ్య 

జగన్ ప్రభుత్వం జనాలకు చాక్లెట్ ఇచ్చి నిలువు దోపిడీ చేస్తోందని ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. జగన్ పాలన మోసపూరిత వ్యాపార ధోరణితో కొనసాగుతోందని విమర్శించారు. జనాలకు చాక్లెట్ ఇచ్చి నిలువుదోపిడీ చేస్తున్నారని అన్నారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా దిగజార్చారని దుయ్యబట్టారు. ఎస్సీ కార్పొరేషన్ కింద జరగాల్సిన 26 పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులను మళ్లించకూడదని గతంలోనే చట్టం చేశారని.. అయితే వీటిని జగన్ పట్టించుకోలేదని చెప్పారు.

Kanna Lakshminarayana
BJP
Jagan
YSRCP
  • Loading...

More Telugu News