Adimulapu Suresh: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తల్లి కన్నుమూత

AP minister Adimulapu Suresh mother passes away

  • హైదరాబాద్ లోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన థెరీసమ్మ
  • 85 ఏళ్ల థెరీసమ్మ ఉపాధ్యాయురాలుగా పనిచేశారు 
  • ఈ సాయంత్రం మార్కాపురంలో అంత్యక్రియలు

ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి థెరీసమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 85 ఏళ్లు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె ఉపాధ్యాయురాలిగా బాధ్యతలను నిర్వహించారు. 

కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న డాక్టర్ ఆదిమూలపు శామ్యూల్ జార్జి విద్యా సంస్థలకు ఆమె ఛైర్ పర్సన్ గా కూడా ఉన్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు మార్కాపురంలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు. మరోవైపు తన తల్లి మృతి నేపథ్యంలో ఆదిమూలపు సురేశ్ కు పార్టీలకు అతీతంగా పలువురు నేతలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

Adimulapu Suresh
YSRCP
Mother
Dead
  • Loading...

More Telugu News