srinivasa rao: ఫోర్త్ వేవ్ పై అప్రమత్తంగా ఉన్నాం: తెలంగాణ హెల్త్ డైరెక్టర్

We are fully alert says Telangana Health Director
  • ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందన్న శ్రీనివాసరావు
  • కొవిడ్ టెస్టులను పెంచామని వెల్లడి
  • అందరూ పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
ప్రపంచదేశాలను కరోనా మరోసారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఫోర్త్ వేవ్ పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. వైద్య, ఆరోగ్యశాఖ అన్ని జాగ్రత్తలను తీసుకుంటోందని తెలిపారు. కొవిడ్ టెస్టులను పెంచామని తెలిపారు. 

ఇప్పటికే రాష్ట్రంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. మరోసారి కరోనా ప్రభావం పెరిగే అవకాశం లేదని... అయినప్పటికీ అందరూ పూర్తి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గుంపులుగా ఉన్నప్పుడు మాస్క్ ధరించాలని చెప్పారు. కరోనా లక్షణాలు కనిపిస్తే టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.
srinivasa rao
te
Health Director

More Telugu News