Sri Krishna: కృష్ణ జన్మభూమిపై నిర్మించిన మసీదుపై సర్వేకు ఆదేశించిన మధుర కోర్టు

Court orders for survey in Krishna janmabhoomi

  • శ్రీకృష్ణుడి జన్మస్థానంపై వివాదం
  • కృష్ణుడి జన్మస్థలంపై మసీదును నిర్మించారని ఆరోపిస్తూ హిందూవాదుల పిటిషన్
  • సర్వేను నిర్వహించాలని కోర్టు ఆదేశం

హిందువులు అత్యంత భక్తిభావంతో పూజించే శ్రీకృష్ణుడి జన్మస్థానంపై వివాదం నెలకొంది. మధురలోని షాహి మసీదుకు సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జనవరి 2 తర్వాత సర్వేను నిర్వహించాలని ఉత్తరప్రదేశ్ లోని ఒక స్థానిక కోర్టు ఆదేశించింది. నివేదికను జనవరి 20 తర్వాత సమర్పించాలని పేర్కొంది. శ్రీకృష్ణుడి జన్మస్థలం ఉన్న ప్రదేశంలో 17వ శతాబ్దంలో మసీదును నిర్మించారని కోర్టులో హిందూవాదులు పిటిషన్ వేశారు. 

మసీదు నిర్మించిన ప్రదేశం కృష్ణుడి జన్మస్థలమని పిటిషన్ లో వారు పేర్కొన్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆదేశాల మేరకు 1669-70 మధ్యకాలంలో 13.37 ఎకరాల్లోని కాత్ర కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించారని హిందూ సేన జాతీయ వైస్ ప్రెసిడెంట్ సుర్జిత్ సింగ్ యాదవ్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు సర్వేను నిర్వహించాలని ఆదేశించింది.

Sri Krishna
Birth Place
Mathura
  • Loading...

More Telugu News