Nayanatara: ఎన్టీఆర్ రిహార్సల్స్ చేయడు .. ఆయన డాన్స్ అదుర్స్: నయనతార

Nayanatara Interview

  • నయనతార తాజా చిత్రంగా 'కనెక్ట్'
  • ఈ నెల 22వ తేదీన సినిమా రిలీజ్ 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నయన్ 
  • తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ప్రస్తావన 
  • ఆయన డాన్స్ నెక్స్ట్ లెవెల్ అంటూ ప్రశంసలు

నాయిక ప్రధానమైన కథలతో కట్టిపడేయడం నయనతార ప్రత్యేకత. ఈ తరహా కథలలో ఆమె ఎక్కువగా హారర్ థ్రిల్లర్ జోనర్ ను ఎంచుకుంటూ ఉంటారు. అలా ఆమె చేసిన మరో హారర్ థ్రిల్లర్ సినిమానే 'కనెక్ట్'. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 22వ తేదీన విడుదల కానుంది. 

సాధారణంగా నయనతార తన సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొనరు. కానీ 'కనెక్ట్' సినిమా ఆమె సొంత బ్యానర్ పై నిర్మించడం జరిగింది. అందువలన ఆమె ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే సుమ చేసిన ఇంటర్వ్యూలో నయనతార దగ్గర ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆమె తనదైన శైలిలో స్పందించారు.    

" చాలామంది హీరోలు రిహార్సల్స్ అవసరం లేకుండా డాన్స్ చేస్తామని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఒకటీ రెండు సార్లయినా వాళ్లు రిహార్సల్స్ చేస్తుంటారు. కానీ ఎన్టీఆర్ అలా కాదు .. రిహార్సల్స్ చేద్దామా అని అడిగితే, తనకి అవసరం లేదని అంటారు. డాన్స్ మాస్టర్ చెప్పడమే ఆలస్యం .. టేక్ కి వెళ్లిపోదామని అంటారు. ఒక్కోసారి డాన్స్ మాస్టర్ చెప్పినదానికంటే బెటర్ గా చేయడం చూసి నేను ఆశ్చర్యపోయేదానిని. నిజంగా ఆయన చాలా టాలెంటెడ్" అంటూ చెప్పుకొచ్చారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి 'అదుర్స్' సినిమాలో చేసిన సంగతి తెలిసిందే.

Nayanatara
Ntr
Tollywood
  • Loading...

More Telugu News