Pawan Kalyan: మళ్లీ వస్తున్న పవన్ కల్యాణ్ 'ఖుషి'

Pawan Kalyan Khushi set to re release
  • 2001లో రిలీజైన పవన్ కల్యాణ్ ఖుషి
  • యూత్ లో పవన్ కు భారీ క్రేజ్
  • ఈసారి 4కే టెక్నాలజీతో రీ రిలీజ్
  • డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు!
ఇరవై ఒక్క సంవత్సరాల కిందట తెలుగు ప్రజలను ఒక ఊపు ఊపిన చిత్రం ఖుషి. పవన్ కల్యాణ్ కెరీర్ లో అప్పటికి అదే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పవన్ ను యూత్ కు మరింత దగ్గర చేసిన చిత్రం కూడా అదే. పవన్, భూమిక కెమిస్ట్రీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి ఎస్ జే సూర్య దర్శకుడు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఉర్రూతలూగించాయి. 

కాగా, ఈ సినిమా మళ్లీ వస్తోంది. డిసెంబరు 31న రీ రిలీజ్ అవుతోంది. ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా ఖుషి చిత్రాన్ని 4కే రిజల్యూషన్. 5.1 డాల్బీ సౌండ్ తో తీసుకువస్తున్నారు. ఇటీవల పవన్ మరో హిట్ చిత్రం జల్సా కూడా 4కే హంగులతో రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
Pawan Kalyan
Khushi
Re Release
Tollywood

More Telugu News