Ambati Rambabu: నేను కాదు... పవన్ కల్యాణే కాపుల గుండెల్లో కుంపటి: అంబటి రాంబాబు

Ambati Rambabu gives fitting reply to Pawan Kalyan

  • సత్తెనపల్లిలో పవన్ కౌలు రైతు భరోసా యాత్ర
  • అంబటి కాపుల గుండెల్లో కుంపటి అంటూ విమర్శలు
  • పవన్ కాపుల పాలిట శని అంటూ అంబటి కౌంటర్
  • పవన్ వారాహి పేరు మార్చుకోవాలని స్పష్టీకరణ

పల్నాడు జిల్లా ధూళిపాళ్లలో ఇవాళ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, కాపుల గుండెల్లో కుంపటి అంబటి... పోలవరం పూర్తిచేయడం చేతకాని అంబటి ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంటూ విమర్శనాస్త్రాలు సంధించడం తెలిసిందే. దీనిపై మంత్రి అంబటి రాంబాబు అదేస్థాయిలో స్పందించారు. 

నేను కాదు... పవనే కాపుల గుండెల్లో కుంపటి అని స్పష్టం చేశారు. కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు... ఏనాడైనా పోలవరంపై చంద్రబాబును ప్రశ్నించావా? అంటూ మండిపడ్డారు. కాపుల పాలిట శని పవన్ కల్యాణ్ అని విమర్శించారు. 

తనపై పవన్ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామా చేస్తానని అంబటి సవాల్ విసిరారు. వారాహి పేరు మార్చుకోకపోతే పవన్ భ్రష్టుపట్టిపోతాడని హెచ్చరించారు. "వారాహి అనేది అమ్మవారి పేరు... పవన్ తన వాహనానికి వరాహం అని పేరుపెట్టుకోవాలి" అని స్పష్టం చేశారు. 

చంద్రబాబు వెంటనే నడుస్తానని, చంద్రబాబును సీఎం చేసేందుకు వచ్చానని పవన్ నేరుగానే చెప్పొచ్చుగా అంటూ అంబటి రాంబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. తప్పు చేస్తే చొక్కా పట్టుకోమని పవన్ అంటున్నారు... రేపు పొత్తు పెట్టుకుంటే ప్రజలు పవన్ చొక్కా పట్టుకోవడం తథ్యం... ప్యాకేజీ తీసుకుని రాజకీయాలు చేసే వ్యక్తి పవన్ అని విమర్శలు చేశారు.

Ambati Rambabu
Pawan Kalyan
Sattenapalli
YSRCP
Janasena
Andhra Pradesh
  • Loading...

More Telugu News