Bigg Boss: ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్-6 గ్రాండ్ ఫినాలే

Bigg Boss season 6 grand finale starts in Star Maa channel

  • గత మూడు నెలలుగా బిగ్ బాస్ సీజన్-6 ప్రసారం
  • నేడు చివరి ఎపిసోడ్
  • విజేత ఎవరో తేలనున్న వైనం
  • బిగ్ బాస్ ఇంట్లో ఐదుగురు కంటెస్టెంట్లు

గత 3 నెలలుగా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను రంజింపజేసిన బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-6 నేటితో ముగియనుంది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ స్టార్ మా చానల్లో ఈ సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున ఘనంగా ఎంట్రీ ఇవ్వగా, హుషారైన డ్యాన్సులతో చివరి ఎపిసోడ్ షురూ అయింది. 

ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన 16 మంది కంటెస్టెంట్లు కూడా విచ్చేశారు. వారిలో యాంకర్ నేహా చౌదరి కాసేపట్లో పెళ్లి పెట్టుకుని, అదే మేకప్ లో గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కు రావడం విశేషం. 

కాగా, బిగ్ బాస్ ఇంట్లో ప్రస్తుతం ఐదుగురు కంటెస్టెంట్లు మిగిలారు. రేవంత్, రోహిత్ సాహ్నీ, కీర్తి, శ్రీహాన్, ఆదిరెడ్డిలలో ఒకరు విజేతగా నిలవనున్నారు. 

బిగ్ బాస్ సీజన్-6 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు ధమాకా చిత్రం కోసం రవితేజ తదితరులు విచ్చేసినట్టు ప్రోమోలో చూపించారు. అంతేకాదు, సీనియర్ నటి రాధ కూడా బిగ్ బాస్ స్టేజిపై సందడి చేయడం ప్రోమోలో చూడొచ్చు.

More Telugu News