Benz Car: కత్తితో బెదిరించి బెంజ్ కారును దొంగిలించారు

Men with knives steels Benz car

  • గురుగ్రామ్ పరిధిలో చోరీ
  • మూత్ర విసర్జన కోసం కారును ఆపిన లాయర్
  • ప్రాణ భయంతో ఏమీ చేయలేకపోయిన వైనం  

దుండగులు ఓ వ్యక్తిని బెదిరించి మెర్సిడెస్ బెంజ్ కారును దొంగిలించిన ఘటన గురుగ్రామ్ లో జరిగింది. గురుగ్రామ్ పరిధిలోని సెక్టార్ 29 ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, మూత్ర విసర్జన కోసం అంజు బేడీ అనే ఓ లాయర్ తన బెంజ్ కారును రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు హ్యుందాయ్ కారులో అటుగా వచ్చారు. తమ కారును బెంజ్ కారుకు అడ్డంగా నిలిపి, లాయర్ ను కత్తితో బెదిరించి, కారును దొంగిలించారు. ప్రాణ భయంతో లాయర్ ఏమీ చేయలేక పోయాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను మొదలు పెట్టారు.

Benz Car
Theft
  • Loading...

More Telugu News