Nitin: ఓటీటీలో దుమ్మురేపుతున్న నితిన్, కృతి శెట్టి చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’

Nitin and Krithi Shetty Macherla Niyojakavargam in ZEE5

  • థియేటర్లలో విడుదలై విజయాన్ని సాధించిన 'మాచర్ల నియోజకవర్గం'
  • ఈ నెల 9 నుంచి జీ5లో స్ట్రీమింగ్ 
  • ఇప్పటి వరకు 75 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించి సత్తా చాటిన వైనం

నితిన్, కృతి శెట్టి జంటగా నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా థియేటర్లలో విడుదలై విజయాన్ని సాధించింది. ఈ సినిమా ద్వారా నితిన్ మరో విజయాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ చిత్రం ఈ నెల 9 నుంచి ఓటీటీ మాధ్యమం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో సైతం ఈ చిత్రం దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకు 75 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించి సత్తా చాటుతోంది. ఈ చిత్రంలో సముద్ర ఖని, క్యాథరిన్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, జయప్రకాశ్, వెన్నెల కిశోర్, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఎం. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. 

సినిమా కథాంశంలోకి వెళ్తే... సిద్ధార్థ్ రెడ్డి (నితిన్‌) సివిల్ స‌ర్వీస్ ఎగ్జామ్స్ రాసి రిజ‌ల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటాడు. గుంటూరు జిల్లాలోని మాచ‌ర్లకు చెందిన స్వాతి త‌న నియోజ‌కవ‌ర్గంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌పై సాయం కోసం ఎదురు చూస్తుంటుంది. రాజ‌ప్ప (స‌ముద్ర ఖ‌ని) మాచ‌ర్ల నియోజ‌కవ‌ర్గంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా చూస్తుంటాడు. అలాంటి వ్య‌క్తికి ఎదురెళుతుంది స్వాతి. ఆమెను చంప‌టానికి రాజ‌ప్ప ప్ర‌య‌త్నిస్తాడు. స్వాతిని సిద్ధార్థ్ కాపాడుతాడు. రాజ‌ప్ప గురించిన నిజం అత‌నికి తెలుస్తుంది. అదే స‌మ‌యంలో అత‌నికి గుంటూరు జిల్లాకే క‌లెక్ట‌ర్‌గా పోస్టింగ్ వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పోరాటం ఇంకా ఉద్ధృతంగా మారుతుంది. చివ‌ర‌కు రాజ‌ప్ప‌ను సిద్ధార్థ్ ఎలా ఎదుర్కొన్నాడ‌నేదే సినిమా. స్వ‌ర సాగ‌ర్ మ‌హ‌తి ఇటు క్లాస్‌, అటు మాస్ ఆడియెన్స్‌ను అల‌రించేలా సంగీతాన్ని అందించారు. ప్ర‌సాద్ మూరెళ్ల స‌న్నివేశాల‌ను త‌న సినిమాటోగ్ర‌ఫీతో అద్భుతంగా ఆవిష్క‌రించారు.

  • Loading...

More Telugu News