Janasena: సత్తెనపల్లిలో ఈ నెల 18న జనసేన కౌలు రైతు భరోసా కార్యక్రమం

Janasena farmers program on December 18
  • ఏపీలో కౌలు రైతుల ఆత్మహత్యలు
  • రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేస్తున్న జనసేన
  • ఇప్పటిదాకా 7 జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర పూర్తయిందన్న నాదెండ్ల
రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన పార్టీ కౌలు రైతు భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ నెల 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా కార్యక్రమం చేపడుతున్నట్టు ఆ పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడేళ్లలో అధికారిక లెక్కల ప్రకారం 1,673 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వివరించారు. రైతు స్వరాజ్య వేదిక సర్వే ప్రకారం ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల సంఖ్య 3 వేలకు పైనే ఉందని తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ నుంచి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు 7 జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమం పూర్తయిందని నాదెండ్ల పేర్కొన్నారు. 

రైతులు క్రాప్ హాలిడే కాకుండా, వైసీపీ ప్రభుత్వానికి హాలిడే ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు.
Janasena
Farmers
Pawan Kalyan
Sattenapalle
Nadendla Manohar
Andhra Pradesh

More Telugu News