Inaya: బిగ్ బాస్ హౌస్ లో నాకు ఎవరు ఇష్టమంటే..!: ఇనయా

Bigg Boss 6  Update

  • బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఇనయా 
  • గీతూ ఎక్కువగా గొడవలు పడేదంటూ వ్యాఖ్య 
  • హౌస్ లో తనకి నచ్చింది మెరీనా - వాసంతి అని వెల్లడి 
  • ఇకపై సినిమాలపైనే ఫోకస్ చేస్తానని స్పష్టీకరణ

బిగ్ బాస్ హౌస్ లో తమకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న అతి కొద్ది మందిలో ఇనయా ఒకరు. లేడీ టైగర్ అంటూ సోషల్ మీడియాలో ఆమెను ఫ్యాన్స్ సపోర్టు చేస్తూ వచ్చారు. అలాంటి ఇనయా టాప్ 7 వరకూ హౌస్ లో ఉండగలిగింది. ఆదివారం రోజున ఆమె ఎలిమినేట్ అయింది.

తాజా ఇంటర్వ్యూలో ఇనయా మాట్లాడుతూ .. " బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ఫస్టు వీక్ లో మాత్రమే నాకు కాస్త భయంగా అనిపించింది. ఆ తరువాత నా స్టయిల్లో నేను ఆడుతూ వెళ్లాను. టాప్ 5 వరకూ ఉంటానని అనుకున్నాను .. కానీ అలా జరగలేదు. బిగ్ బాస్ హౌస్ లో నా జర్నీ చాలా హ్యాపీగా జరిగిందనే అనుకుంటున్నాను. 

హౌస్ నుంచి గీతూ రాయల్ వెళ్లిపోయినప్పుడు మాత్రం నేను చాలా షాక్ అయ్యాను. తను ఒక్కోసారి చిన్నపిల్లలా ఉండేది .. సిల్లీ పాయింట్స్ కి కూడా నామినేట్ చేసేది. ప్రతి విషయానికి పోట్లాడేది .. తనకి నచ్చినవారితో మాత్రమే మాట్లాడేది. హౌస్ లో నాకు నచ్చినవారు ఎవరైనా ఉన్నారంటే అది మెరీనా .. వాసంతినే. ఇకపై సినిమాలపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చింది. 


Inaya
Revanth
Srihan
Keerthi
Bigg Boss
  • Loading...

More Telugu News