Sajjala Ramakrishna Reddy: బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ కోరితే ఆలోచిస్తాం: సజ్జల

Sajjala opines on KCR BRS party

  • ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదేనన్న సజ్జల 
  • ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చని వ్యాఖ్యలు
  • ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ఆలోచన వైసీపీకి లేదని వెల్లడి 

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై స్పందించారు. బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ కోరితే ఆలోచిస్తామని సజ్జల వెల్లడించారు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే సీఎం జగన్ అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 

రాజకీయ పార్టీగా ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చని పేర్కొన్నారు. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదే అని అభిప్రాయపడ్డారు. అయితే, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ఆలోచన వైసీపీకి లేదని సజ్జల స్పష్టం చేశారు. విభజన హామీలపై తాము పోరాటం చేస్తూనే ఉన్నామని వెల్లడించారు.

Sajjala Ramakrishna Reddy
BRS
KCR
Jagan
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News