Anupama parameshwaran: హాట్ స్టార్ కి 'బటర్ ఫ్లై' .. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Butter Fly On Hotstar

  • అనుపమ ప్రధాన పాత్రగా 'బటర్ ఫ్లై'
  • కీలకమైన పాత్రలో కనిపించనున్న భూమిక  
  • దర్శకత్వం వహించిన సతీశ్ బాబు
  • ఈ నెల 29 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్  

యంగ్ హీరోల జోడీగా కుదురుగా ఒదిగిపోయే హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తుంది. కళ్లతోనే చక్కని హావభావాలు పలికించే నటిగా ఆమెకి మంచి పేరు ఉంది. ఇటీవల ఆమె నుంచి వచ్చిన 'కార్తికేయ 2' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నిఖిల్ తోనే చేసిన మరో చిత్రంగా '18 పేజెస్' త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలోనే అనుపమ 'బటర్ ఫ్లై' సినిమా చేసింది. ఈ మధ్య కాలంలో ఈ సినిమాను గురించిన అప్ డేట్ లేదు. అనుపమ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాను, 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రకటన కొంతసేపటి క్రితమే చేశారు. 

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో హాట్ స్టార్ వారు ఈ సినిమాను అందుబాటులో ఉంచుతున్నారు.  అనుపమ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, రవి ప్రకాశ్ .. ప్రసాద్ .. ప్రమోద్ నిర్మించగా, ఘంట సతీశ్ బాబు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో భూమిక ఒక కీలకమైన పాత్రను పోషించింది.

Anupama parameshwaran
Butter Fly Movie
Bhumika
  • Loading...

More Telugu News