Roja: ఎవరితో యుద్ధం చేయాలో పవన్ కు అర్థం కావడం లేదు: రోజా

Pawans does not khno with whom to fight says Roja

  • పవన్ ది వారాహి కాదు నారాహి వాహనం అన్న రోజా
  • అభ్యర్థులను పెట్టుకోలేని స్థితిలో పవన్ ఉన్నారని ఎద్దేవా
  • చంద్రబాబు కోసం దత్తపుత్రుడు పని చేస్తున్నారని విమర్శ

జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసుకున్నది వారాహి వాహనం కాదని... అది నారాహి వాహనమని అన్నారు. ఎవరితో యుద్ధం చేయాలో కూడా పవన్ కు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. కత్తులు పట్టుకుని పిచ్చిపిచ్చి ట్వీట్లు చేయడం రాజకీయాల్లో సరికాదని అన్నారు. 

ఆలివ్ గ్రీన్ కలర్ ను ఆర్మీ వాళ్లు మాత్రమే వాడాలనే నిబంధన ఉందని... పవన్ కల్యాణ్ వాహనానికి ఆ రంగు ఎలా వేస్తారని ఆమె ప్రశ్నించారు. 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టుకోలేని స్థితిలో జనసేన ఉందని రోజా ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ఉన్న పవన్ కు శ్వాస తీసుకోవాలా? వద్దా? అని చెప్పాల్సింది కేసీఆర్, కేటీఆర్ అని అన్నారు. చంద్రబాబు కోసం దత్తపుత్రుడు పని చేస్తున్నాడని చెప్పారు. పవన్ కు రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేదని, సొంత పార్టీపైనా ప్రేమ లేదని అన్నారు.

Roja
YSRCP
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News