Kethika: అదృష్టం కోసం వెయిట్ చేస్తున్న అందాల కేతిక .. లేటెస్ట్ పిక్స్

- గ్లామరస్ హీరోయిన్ గా మెరిసిన కేతిక
- యూత్ లో విపరీతమైన క్రేజ్
- నిరాశపరిచిన మూడు సినిమాలు
- మొహం తిప్పేసుకున్న అవకాశాలు
- కలిసొచ్చే కాలం కోసమే ఆమె వెయిటింగ్
తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందాల కథానాయికలలో కేతిక ఒకరు. పూరి జగన్నాథ్ బ్యానర్ నుంచి ఒక హీరోయిన్ వచ్చిందంటే .. పూరి మెచ్చిన బ్యూటీ అంటే తప్పకుండా మేటర్ ఉంటుందని అంతా అనుకుంటారు. అనుకున్నట్టుగానే ఈ సుందరి 'రొమాంటిక్' సినిమాకి సంబంధించిన ఫస్టు పోస్టర్ తోనే కుర్ర మనసుల్లో కుంపట్లు రాజేసింది. తన అభిమానుల జాబితాలో చేర్చేసుకుంది.

ఇక ఇప్పుడు ఆమె అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది. అవకాశం రావాలి .. దాని వెనుకే సక్సెస్ కూడా రావాలి. ఈ రెండూ రావాలంటే అందుకు తగిన అదృష్టం ఉండాలి. తనని తప్పించుకుని తిరుగుతున్న అదృష్టాన్ని వెతికి పట్టుకునే పనిలోనే ఆమె ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే తన లేటెస్ట్ పిక్స్ వదులుతోంది. కేతిక అందాల గని అనడంలో సందేహం లేదు. కాకపోతే ఒక హిట్టుతో దిష్టి తీసేస్తేనేగాని లైన్లో పడదేమో!
