Pawan Kalyan: పవన్ కల్యాణ్ బస్సుయాత్రకు 'వారాహి' రెడీ... వీడియో ఇదిగో!

- త్వరలో పవన్ బస్సు యాత్ర
- పవన్ కోసం ప్రత్యేకంగా బస్సుకు రూపకల్పన
- నిర్మాణం పూర్తి చేసుకున్న బస్సుకు ట్రయల్ రన్
- స్వయంగా పర్యవేక్షించిన పవన్ కల్యాణ్
త్వరలోనే జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. పవన్ వాస్తవానికి దసరా నుంచి బస్సు యాత్ర షురూ చేయాలని భావించినా, అది కార్యరూపం దాల్చలేదు. కాగా, పవన్ బస్సుయాత్రకు ఉపయోగించే భారీ వాహనం సిద్ధమైంది.

కాగా, ఈ బస్సు ఆలివ్ రంగులో చూడ్డానికి మిలిటరీ వాహనంలా కనిపిస్తోంది. ఎంతో దృఢంగా కనిపిస్తున్న ఈ వాహనంలో పవన్ కు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు.
