Zombie virus: జాంబీ వైరస్ సోకిందా..? లేక డ్రగ్స్ తీసుకున్నారా? అలా ఊగిపోతున్నారేంటి?.. ట్విట్టర్ లో వీడియో వైరల్

Zombie virus or drugs People acting strange on the streets of Philadelphia shocks Twitter

  • ఫిలడెల్ఫియాలో కొందరు వ్యక్తుల విచిత్ర ప్రవర్తన
  • ట్విట్టర్ లో వైరల్ అవుతున్న వీడియో
  • వీరికి ఏమైందంటూ నెటిజన్ల ప్రశ్నలు

కరోనా వైరస్ సృష్టించిన విధ్వంసాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈ లోపే వేల ఏళ్ల కిందట మంచు ఫలకాల కింద మరుగున పడిపోయిన జాంబీ వైరస్ ను పునరుజ్జీవింప చేసినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించడం పెద్ద చర్చకు దారితీసింది. పర్యావరణ కాలుష్యం, భూతాపంతో మంచు ఫలకాలు కరిగి, అందులో దాగిపోయిన భయంకరమైన వైరస్ లు మళ్లీ జీవం సంతరించుకునే రిస్క్ ను తెలియజేసేందుకు శాస్త్రవేత్తలు ఇటీవలే ఓ అధ్యయనం నిర్వహించారు. 

ఇప్పుడు ఫిలడెల్ఫియాలో కొందరు వ్యక్తులు రోడ్లపై చిత్ర, విచిత్రంగా ప్రవర్తిస్తున్న వీడియో ఒకటి ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ తలను వెనక్కి వంచేసి, అటూ, ఇటూ ఊగుతూ పడిపోకుండా బ్యాలన్స్ చేసుకుంటుంటే.. మరో వ్యక్తి కిందకు వంగి అటూ ఇటూ తూలుతూ ఉండడం ఈ వీడియోలో గమనించొచ్చు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో, ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. 

ఏంటీ జాంబీ వైరస్ అప్పుడే మానవాళిపై దాడిని మొదలు పెట్టిందా? అని ఓ యూజర్ ప్రశ్నించగా..? బ్రో.. యూఎస్ఏలో అసలు ఏం జరుగుతోంది? అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. మనం గత వారం విన్న జాంబీ వైరస్ కాదుగా ఇది? అంటూ ఇంకో యూజర్ ప్రశ్నించాడు. అయితే, వీరు డ్రగ్స్ తీసుకున్న వారు అయి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

More Telugu News