Srikakulam District: శ్రీకాకుళంలో వైసీపీ నేత దారుణ హత్య

YSRCP leader murder

  • శ్రీకాకుళం జిల్లా గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడు హత్య
  • కత్తితో నరికి చంపిన దుండగులు
  • 2017లో కూడా మృతుడిపై హత్యాయత్నం

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన నేతను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామశేషును దుండగులు కత్తితో నరికి చంపారు. శ్రీకూర్మం గ్యాస్ గోడౌన్ సమీపంలో ఈ హత్య జరిగింది. 

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పక్కనున్న పొలాల్లో హత్యకు వాడిన కత్తిని గుర్తించారు. రామశేషు ఒంటిపై ఉన్న బంగారం అలాగే ఉంది. సెల్ ఫోన్ ను కూడా దుండగులు వదిలేసిపోవడంతో... ఇది దొంగల పని కాదని అంటున్నారు. రియలెస్టేట్ వ్యవహారాలు, వివాహేతర సంబంధం కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొని ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 2017లో కూడా రామశేషుపై హత్యాయత్నం జరిగింది.

Srikakulam District
YSRCP
Leader
Murder
  • Loading...

More Telugu News