Madhya Pradesh: బస్ స్టాప్ లో నిల్చుంటే మృత్యువు దూసుకొచ్చింది.. వీడియో ఇదిగో!

Truck Rams People At Bus Stop In Madhya Pradesh

  • మధ్యప్రదేశ్ లో జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్.. ఆరుగురి మృతి
  • 11 మందికి తీవ్రగాయాలు.. పలువురి పరిస్థితి విషమం
  • సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ప్రమాద దృశ్యాలు
  • పరారీలో డ్రైవర్.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు కోసం ఎదురుచూస్తూ బస్ స్టాప్ లో నిల్చున్న వారిపైకి ఓ ట్రక్కు దూసుకొచ్చింది. కన్నుమూసి తెరిచేలోపే దారుణం జరిగిపోయింది. ట్రక్కు టైర్ల కింద నలిగి ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో పదకొండు మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులోనూ పలువురి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

రాష్ట్రంలోని రత్లాం జిల్లా కేంద్రంలో ఆదివారం ఈ దారుణ ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు అకస్మాత్తుగా ఎడమవైపు తిరిగి, రోడ్డు పక్కనే ఉన్న బస్ స్టాప్ లో నిల్చున్న వారిని ఢీ కొట్టి ఆగింది. ఈ క్రమంలో రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ ద్విచక్రవాహనదారుడిని ఢీ కొట్టడంతో ఆ యువకుడు ఎగిరి కిందపడడం, ఆ యువకుడి పై నుంచే ట్రక్కు వెళ్లడం కనిపించింది. ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కును వదిలేసి డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

Madhya Pradesh
truck
Road Accident
CCTV vedio

More Telugu News