Delhi: ఢిల్లీలో మూడు రోజుల పాటు లిక్కర్ బంద్

No alcohol for Delhi people for 3 days
  • మున్నిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో లిక్కర్ బంద్
  • రేపు సాయంత్రం నుంచి 4వ తేదీ సాయంత్రం వరకు నో సేల్స్
  • డిసెంబర్ 7న కౌంటింగ్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు లిక్కర్ విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ నెల 4న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం నుంచి మందు బంద్ కానుంది. రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో రేపు సాయంత్రం 5.30 గంటల నుంచి డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, సేల్ ఔట్ లెట్స్ మూతపడనున్నాయి. 

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను జారీ చేసింది. అనధికారికంగా ఎవరూ లిక్కర్ ను నిల్వ చేయడం కానీ, తరలించడం కానీ చేయకుండా పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు, డిసెంబర్ 7న కౌంటింగ్ జరగనుంది.
Delhi
Liquor
Sales

More Telugu News