Tamannah: అప్పటికీ ఇప్పటికీ అదే గ్లామర్ .. తమన్నా న్యూ పిక్స్!

Tamannah Special

  • మిల్కీ బ్యూటీగా తమన్నాకి క్రేజ్
  • తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ డమ్
  • స్టార్ హీరోలందరి జోడీగా అలరించిన తమన్నా  
  • గ్లామర్ పరంగా ఇప్పటికీ తగ్గని జోరు 

తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో తమన్నా ముందు వరుసలో కనిపిస్తుంది. మిల్కీ బ్యూటీగా ఆమె ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తెలుగు .. తమిళ భాషల్లోని టాప్ స్టార్స్ అందరితోనూ ఆమె ఆడిపాడింది. నాయిక ప్రధానమైన కథలతోను మెప్పించింది.తమన్నా కథానాయికగా ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లకి పైగా అవుతోంది. సుదీర్ఘమైన ఈ కెరియర్లో ఆమె ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఒక వైపున కాజల్ .. త్రిష .. అనుష్క వంటి హీరోయిన్స్ నుంచి గట్టిపోటీ ఉన్నప్పటికీ, తమన్నా నిలబడగలిగింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలిగింది. ఈ 15 ఏళ్లలో ఎంతోమంది హీరోయిన్లు తెలుగు తెరకి పరిచయమయ్యారు. కొత్త నీరు రావడం వలన .. సీనియర్ హీరోయిన్స్ కి అవకాశాలు తగ్గడం సహజం. అదే తమన్నా విషయంలోను జరిగింది. అయితే ఆమె పట్ల ప్రేక్షకులకు గల అభిమానం మాత్రం తగ్గలేదు. అందుకు కారణం ఆమె గ్లామర్ .. అందుకు తగిన అభినయం అనే చెప్పాలి. ఇంతకాలమైనా తమన్నా అదే గ్లామర్ తో మెరుస్తూ ఉండటం, కుర్ర హీరోయిన్లను సైతం కంగారు పెడుతున్న అంశంగానే చెప్పుకోవాలి.

Tamannah
Kajal Agarwal
Anushka Shetty
  • Loading...

More Telugu News