Sonu Sood: అనారోగ్యంతో బాధపడుతున్న సారంగి వాయిద్యకారుడు.. బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఆపన్నహస్తం

Actor Sonu Sood Came to Help to Sarangi Musician
  • రాష్ట్రపతి పతకం అందుకున్న హిసార్ వాద్యకారుడు మమన్ ఖాన్
  • ప్రస్తుతం అంపశయ్యపై సాయం కోసం ఎదురుచూపులు
  • యూజర్ పోస్టుకు స్పందించి సాయానికి ముందుకొచ్చిన సోనూసూద్
బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్ మరోమారు పెద్ద మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న హర్యానాకు చెందిన సారంగి వాయిద్యకారుడు మమన్ ఖాన్ (83)కు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న మమన్‌ఖాన్ ఫొటోను షేర్ చేస్తూ, ఆయన పరిస్థితిని వివరిస్తూ ఇంద్రజిత్ బర్కే అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మమన్ ఖాన్ ఈ రోజు చనిపోయే స్థితిలో ఉన్నారని, ఎక్కడి నుంచీ సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

హర్యానాలోని హిసార్ జిల్లా ఖరక్ పునియా గ్రామానికి చెందిన ఆయన హర్యానా ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి పతకం, తామ్ర ఫలకం అందుకున్నారని ఇంద్రజిత్ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టు కాస్తా సోనూసూద్ దృష్టిలో పడింది. వెంటనే స్పందించిన ఆయన సాయానికి ముందుకొచ్చారు. ‘‘ఖాన్ సాబ్ ముందు మీ ఆరోగ్యం నయం చేస్తా.. తర్వాత మీ సారంగి పాట వింటా’ అని సోనూసూద్ రీట్వీట్ చేశారు.
Sonu Sood
Sarangi Musician
Haryana

More Telugu News