Lamborghini: ఈ కారు ప్రారంభ ధర రూ.4.22 కోట్లు... భారత్ లో కొత్త మోడల్ తెచ్చిన లాంబోర్ఘిని

Lamborghini launhes Urus Performante SUV in India
  • సూపర్ స్పోర్ట్స్ కార్లకు ప్రసిద్ధి చెందిన లాంబోర్ఘిని
  • భారత్ లోనూ మార్కెట్ పెంచుకుంటున్న ఇటలీ దిగ్గజం
  • సెలెబ్రిటీలకు ఇష్టమైన కారుగా గుర్తింపు
  • తాజాగా పెర్ఫార్మెంటే ఎస్ యూవీని లాంచ్ చేసిన ఉరుస్
ఇటలీ కార్ల తయారీ దిగ్గజం లాంబోర్ఘిని సూపర్ స్పోర్ట్స్ కార్లకు పెట్టింది పేరు. లాంబోర్ఘిని కార్లను భారత్ లో పలువురు సెలెబట్రీలు ఉపయోగిస్తున్నారు. టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ వద్ద కూడా లాంబోర్ఘిని కారు ఉంది. భారత్ లో తొలి లాంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ కాప్సూల్ కారును సొంతం చేసుకున్నది ఎన్టీఆరే. 

ఇక, ఉరుస్ శ్రేణిలో లాంబోర్ఘిని కొత్త కారును భారత్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎస్ యూవీ సెగ్మెంట్లో ఉరుస్ పెర్ఫార్మెంటే మోడల్ ను పరిచయం చేసింది. ఉరుస్ పెర్ఫార్మెంటే ప్రారంభ ధర రూ.4.22 కోట్లు (ఎక్స్ షోరూం). ఉరుస్ స్టాండర్డ్ మోడల్ ఎస్ యూవీ కంటే పెర్ఫార్మెంటే ధర రూ.1.12 కోట్లు ఎక్కువ. 

ఈ కొత్త కారు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.3 సెకన్లలోనే అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 306 కిలోమీటర్లు. ఇది అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదలై నాలుగు నెలల్లోనే భారత్ లో అడుగుపెడుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎస్ యూవీగా ఉరుస్ పెర్ఫార్మెంటే గుర్తింపు తెచ్చుకుంది.
Lamborghini
Urus Performante
SUV
India
Italy

More Telugu News