Team India: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. భారత తుది జట్టులోకి ఉమ్రాన్ మాలిక్

Kiwis won the toss and opt to bowl

  • టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్
  • టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇండియా
  • వన్డే జట్టుకు కెప్టెన్‌గా ధావన్

మూడు మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించింది. ఇంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. దీంతో ఈ సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా బదులు తీర్చుకోవాలని కివీస్ యోచిస్తోంది. 

టీ20 సిరీస్‌లో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహించగా, వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ భారత తుది జట్టులో చోటు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఏడు ఓవర్లు ముగిశాయి. ఇండియా వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. కెప్టెన్ ధావన్ (16), శుభమన్ గిల్ (10) క్రీజులో ఉన్నారు.

Team India
Team New Zealand
Auckland
  • Loading...

More Telugu News