Adivi Sesh: 'హిట్' సిరీస్ లో ఎన్ని కేసులు ఉంటాయంటే..: అడివి శేష్

Adivi Sesh Interview

  • డిసెంబర్ 2న రానున్న 'హిట్ 2'
  • ప్రమోషన్స్ లో బిజీగా అడివి శేష్ 
  • 'హిట్' సిరీస్ లో 7 కేసులు ఉంటాయని వెల్లడి 
  • త్వరలో శర్వానంద్ పెళ్లి ఉండొచ్చని వ్యాఖ్య

మొదటి నుంచి కూడా అడివి శేష్ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'హిట్ 2' రెడీ అవుతోంది. వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో అడివి శేష్ బిజీగా ఉన్నాడు. 

తాజా ఇంటర్వ్యూలో శేష్ మాట్లాడుతూ .. 'హిట్ 1'లో విష్వక్సేన్ చేశాడు .. 'హిట్ 2'లో నేను చేశాను. ఇలా 'హిట్ 7' వరకూ ఉండొచ్చని శైలేశ్ కొలను చెప్పినట్టుగా గుర్తు. ఒక్కో కేసును ఒక్కో పోలీస్ ఆఫీసర్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించే నేపథ్యంలో ఈ సినిమాలు నడుస్తాయి. 'హిట్ 3'లో హీరో ఎవరేది 'హిట్ 2' చివరలో మీకు తెలిసిపోతుంది" అని చెప్పాడు.  

"డాన్సులు చేయమంటే నాకు కాస్త కష్టమే .. అయినా చేయవలసి వస్తే ట్రై చేస్తాను. ఇక ఎక్కడికి వెళ్లినా అందరూ పెళ్లి ప్రస్తావన తెస్తున్నారు. మా ఫ్రెండ్స్ సర్కిల్ లో శర్వానంద్ ముందుగా పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను బయటపడడుగానీ, త్వరలో పెళ్లి వార్త చెబుతాడనే అనుకుంటున్నాను" అని అన్నాడు.

Adivi Sesh
Hit 2 Movie
Sailesh Kolanu
  • Loading...

More Telugu News