Hansika: ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో హన్సిక, సోహెల్

hansika and sohael pre wedding celebrations

  • కాబోయే భర్తతో కలిసి హన్సిక ఫొటోషూట్
  • ఎరుపు రంగు దుస్తులతో మెరిసిన జంట
  • వచ్చే నెల 4న జైపూర్ కోటలో వివాహం

హీరోయిన్ హన్సిక మోత్వాని పెళ్లి వేడుకలు మంగళవారం నుంచే మొదలయ్యాయి. వచ్చే నెలలో రాజస్థాన్ లో హన్సిక పెళ్లి జరగనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త సోహెల్ ఖతూరియాను పెళ్లి చేసుకోబోతున్నట్లు హన్సిక ఇటీవలే ప్రకటించింది. తాజాగా ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ఫొటోలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్ట్  చేసింది. మంగళవారం రాత్రి జరిగిన మాతా కీ చౌకీ ఫంక్షన్‌లో హన్సిక మోత్వాని, సోహెల్ ఖతూరియా ఎరుపు రంగు దుస్తులతో మెరిసిపోయారు. హన్సిక, సోహెల్, సోదరుడు ప్రశాంత్ మోత్వానితో కలిసి ఫోటోకు పోజులిచ్చారు.

వచ్చే నెల 4న హన్సిక, సోహెల్ ల పెళ్లి రాజస్థాన్ లో జరగనుంది. జైపూర్ లో 14వ శతాబ్దంలో నిర్మించిన ముండోటా కోటలో జరిగే వివాహ వేడుకతో ఈ జంట ఒక్కటవ్వనున్నారు. డిసెంబర్ 3న మెహందీ వేడుక జరగనుందని సమాచారం. ఇక పెళ్లి రోజు ఉదయం హల్దీ వేడుక నిర్వహించి, వివాహం పూర్తయ్యాక సాయంత్రం క్యాసినో పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

Hansika
motwani
sohael
hansika weddinig
jaipur
pre wedding celebrations
  • Loading...

More Telugu News