Marina: ఓవర్ గా రియాక్ట్ కావడం నాకు అలవాటు లేదు: మెరీనా

Marina Interview

  • బిగ్ బాస్ హౌస్ లో 11వారాలున్న మెరీనా 
  • ఆదివారం రోజున జరిగిన ఎలిమినేషన్
  • బీబీ కేఫ్ ఇంటర్వ్యూలో పాల్గొన మెరీనా 
  • తాను తనలాగే ఉండగలిగానంటూ వ్యాఖ్య

బిగ్ బాస్ హౌస్ నుంచి ఆదివారం రోజున మెరీనా బయటికి వెళ్లిపోయింది. ఇక్కడ 11 వారాల జర్నీ చూసిన ఆమె, కన్నీళ్లతో హౌస్ ను వదిలిపెట్టింది. తాజాగా 'బీబీ కేఫ్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెరీనా పాల్గొంది. హౌస్ లో తాను ఎలా ఉండాలని అనుకుని వెళ్లానో అలాగే ఉండగలిగానంటూ, తన ఆటతీరుపై సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ వెళ్లింది. 

"హౌస్ లో ఉన్నది పోటీదారులు .. నా శత్రువులు కాదు. అందువలన నా మనసుకు ఎంతో బాధ కలిగితేనే తప్ప, నేను ఎవరితోను గొడవ పడలేదు. మెరీనా చాటుగా మాత్రమే మాట్లాడుతుందనే విమర్శలను నేను తీసుకోను. ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే నేను ఎదురుగానే చెబుతాను .. లేదంటే మౌనంగా ఉండిపోతాను. అంతేతప్ప ఎవరి గురించి ఎవరితోను చెడుగా మాట్లాడలేదు" అంది. 

"శ్రీహాన్ కి ఏదో విషయం చెప్పబోతే చాలా సీరియస్ అయ్యాడు. అప్పుడు నాకు చాలా బాధ కలిగింది. బాధ అయినా .. కోపమే అయినా కొంతసేపు మాత్రమే. ఓవర్ గా రియాక్ట్ కావడం .. కెమెరాలు నా వైపే చూడాలని హడావిడి చేయడం నాకు అలవాటు. నాకు ఆడటం తెలియలేదని అంటున్నారు. మరి నా కంటే ముందుగా బయటికి వచ్చిన సూర్య మంచి ఆటగాడే గదా?" అంటూ చెప్పుకొచ్చింది.

Marina
Rohith
Revanth
Srihan
Inaya
Bigg Boss
  • Loading...

More Telugu News