Krishnavamsi: మాస్ సినిమాలు చేయడం నాకు చేతకాదు: కృష్ణవంశీ

Krishna vamsi Interview

  • మాస్ సినిమాకి డెఫినేషన్ తెలియదన్న కృష్ణవంశీ  
  • తన సినిమాలు కలర్ఫుల్ గా ఉంటాయంటూ వివరణ 
  • శేఖర్ కమ్ముల సినిమాలు నచ్చుతాయని వెల్లడి   

కృష్ణవంశీ సినిమాల్లో బలమైన కథ ఉంటుంది .. ఆసక్తికరమైన కథనం ఉంటుంది. సహజత్వానికి దగ్గరగా పాత్రలు నడుస్తూ ఉంటాయి. కథానాయికలు అందమైన చందమామల్లా తెరపై తేలుతుంటారు. ఆయన ఫ్రేమ్స్ చాలా కలర్ ఫుల్ గా .. అందమైన గ్రీటింగ్ కార్డ్స్ మాదిరిగా ఉంటాయి. 'మీ నుంచి మాస్ సినిమాను ఎప్పుడు ఆశించవచ్చు?' అనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో ఆయనకి ఎదురైంది. 

అందుకు కృష్ణవంశీ స్పందిస్తూ .. "మాస్ సినిమాలు చేయడం నాకు చేతకాదు. అలాంటి సినిమాలు చేయడం నాకు రాదు. అసలు మాస్ సినిమాకి డెఫినేషన్ ఏమిటనేది నాకు ఇంకా తెలియలేదు. నా సినిమాలు పాజిటివ్ గా ఉండాలి .. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఉండాలి .. కలర్ ఫుల్ గా ఉండాలి .. ప్రోగ్రెసివ్ గా ఉండాలి .. మేనర్స్ ఉండాలి .. వ్యాల్యూ సిస్టం ఉండాలి .. స్టాండర్డ్స్ ఉండాలి .. హ్యుమానిటీ ఉండాలి" అన్నారు. 

"నేను రెగ్యులర్ గా వెబ్ సిరీస్ లు .. సినిమాలు చూస్తూనే ఉంటాను. శేఖర్ కమ్ముల సినిమాలంటే నాకు ఇష్టం. నా సినిమాల్లో హీరోయిన్స్ నచ్చుతారని అంతా అంటూ ఉంటారు. కానీ నాకు తన సినిమాల్లోని హీరోయిన్స్ నచ్చుతారు. 'లవ్ స్టోరీ' కూడా చాలా బాగా చేశాడు. ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన 'అఖండ' .. 'అల వైకుంఠపురములో' సినిమాలు నచ్చాయి. ఇక ఇతర భాషల్లోని సినిమాలను కూడా చూస్తూనే ఉంటాను" అంటూ చెప్పుకొచ్చాడు.

Krishnavamsi
Sekhar Kammula
Tollywood
  • Loading...

More Telugu News