Sri Sathya: టాప్ ఫైవ్ లో నిలిచేది వీరే .. హౌస్ లోని సభ్యులే చెప్పిన మాట!

Bigg Boss 6  Update

  • వేడెక్కుతున్న బిగ్ బాస్ హౌస్ 
  • హౌస్ లోని సభ్యుల అభిప్రాయాలు అడిగిన బిగ్ బాస్
  • టాప్ ఫైవ్ జాబితాలో నిలిచేదెవరంటూ ప్రశ్న 
  • ఫైనల్ గా వినిపించినవి ఆ ఐదుగురి పేర్లే  

'బిగ్ బాస్ హౌస్'లోని సభ్యుల సంఖ్య టాప్ టెన్ కి చేరుకుంది. ఈ పదిమందిలో నుంచి నిన్న రాత్రి మెరీనా బయటికి వెళ్లిపోయింది. ఇనయా వెళుతుందా? మెరీనా వెళుతుందా? అనే టెన్షన్ కొంతసేపటివరకూ కొనసాగింది. ఆ తరువాత ఇనయా సేఫ్ కావడంతో, మెరీనా మిగతా సభ్యుల నుంచి వీడ్కోలును తీసుకోవలసి వచ్చింది. 

అయితే అంతకుముందే ఈ పదిమంది సభ్యులను ఒక ప్రత్యేకమైన రూమ్ కి పిలిచి, హౌస్ లో టాప్ ఫైవ్ వరకూ ఎవరెవరు వెళ్లే అవకాశం ఉంది? అంటూ బిగ్ బాస్ అడిగారు. అందరూ కూడా తమ పేరు ముందుగా చెప్పేసి, ఆ తరువాత ఇతరుల ఆటతీరు పట్ల తమకి గల అభిప్రాయం ప్రకారం మిగతా నలుగురి పేర్లను చెబుతూ వెళ్లారు. అయితే ఈ ప్రక్రియ మిగతా సభ్యులకు తెలుస్తూనే జరిగింది. 

అలా పదిమంది ఇంటి సభ్యుల అభిప్రాయాలను బిగ్ బాస్ పరిగణనలోకి తీసుకున్నాడు. అలా అందరూ చెప్పిన టాప్ ఫైవ్ జాబితాలో రేవంత్ .. శ్రీహాన్ .. ఆదిరెడ్డి .. శ్రీసత్య .. ఫైమా ఉన్నారు. మిగతావారు టాప్ ఫైవ్ తరువాతనే ఉన్నారు. ఇదే విషయాన్ని నాగార్జున ప్రకటించడం కూడా జరిగింది. ఇక నుంచి గేమ్స్ మరింత కఠినతరంగా ఉంటాయని బిగ్ బాస్ చెప్పడం అందరిలో ఆసక్తిని పెంచుతోంది.

Sri Sathya
Faima
Revanth
Srihan
Adireddy
Bigg Boss
  • Loading...

More Telugu News