Undavalli Arun Kumar: విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సదస్సు... హాజరైన ఉండవల్లి, ఆర్. నారాయణమూర్తి

Undavalli Arun Kumar and R Narayanamurthy comments

  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దంటూ ఉద్యమం
  • మద్దతు పలికిన ఉండవల్లి అరుణ్ కుమార్, నారాయణమూర్తి
  • ప్రైవేటీకరణతో రాష్ట్ర ప్రజలకు నష్టమన్న ఉండవల్లి
  • దస్తూరి కమిటీ నివేదిక అమలు చేయాలన్న నారాయణమూర్తి

విశాఖపట్నంలో నేడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ప్రజావేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి హాజరయ్యారు. 

ఉండవల్లి మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం అని స్పష్టం చేశారు. 'స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దేశ అవసరం' అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లాలని అభిప్రాయపడ్డారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం భారీ సభ నిర్వహించి, డిక్లరేషన్ ఇవ్వాలని ఉండవల్లి పిలుపునిచ్చారు. 

ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ, కేంద్రం ప్రజల ఆకాంక్షలను గుర్తించాలని అన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని, దస్తూరి కమిటీ నివేదిక అమలు చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News