Danam Nagender: బీఫామ్ లను అమ్ముకున్న చరిత్ర అర్వింద్ ది: దానం నాగేందర్

Danam Nagender fires on D Arvind

  • కవితపై అర్వింద్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్న దానం 
  • ఆయన వాడుతున్న భాష సరిగా లేదని విమర్శ 
  • అర్వింద్ మారకపోతే మేము కూడా మారమని హెచ్చరిక 

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వాడుతున్న భాష సరిగా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. ఆయన మారకపోతే తాము కూడా మారేది లేదని అన్నారు. అర్వింద్ ఇంటిపై నిన్న జరిగిన దాడి శాంపిల్ మాత్రమేనని చెప్పారు. కల్వకుంట్ల కవిత గురించి అర్వింద్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని... అర్వింద్ చరిత్ర గురించి చెపితే ఆయన సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ లను అమ్ముకున్న చరిత్ర అర్వింద్ దని చెప్పారు. అర్వింద్ బీఫామ్ లు ఎవరికైతే అమ్మాడో వారందరినీ తీసుకొచ్చి నిలబెడతానని అన్నారు. 

కవితపై చేసిన వ్యాఖ్యలను అర్వింద్ వెనక్కి తీసుకోవాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్, అర్వింద్ ఇద్దరూ బీసీ ద్రోహులు అని విమర్శించారు. అర్వింద్ ఇంటిపై దాడి చేశారంటూ మా వాళ్లను 24 గంటలుగా పోలీస్ స్టేషన్ లో పెట్టారని... వాళ్లంతా ఉద్యమకారులని చెప్పారు. తాము మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే... పోలీస్ కమిషనర్ ఫోన్ ఎత్తడం లేదని అన్నారు. అర్వింద్ ఇంటిపై దాడి ఘటనలో 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

Danam Nagender
K Kavitha
TRS
D Arvind
BJP
  • Loading...

More Telugu News