Pattabhi: ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి, పట్టాభి మధ్య మాటల యుద్ధం

Twitter war between Vijayasai Reddy and Pattabhi
  • ప్రైవేటు విమానాల్లో నల్లధనం తరలిస్తున్నారన్న పట్టాభి
  • ఇలా మాట్లాడే మాల్దీవ్స్ పారిపోయావన్న విజయసాయి
  • పారిపోయే రకం కాదు పరిగెత్తించే రకాన్ని అంటూ పట్టాభి రిప్లయ్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మధ్య ట్విట్టర్ లో జోరుగా మాటల యుద్ధం సాగుతోంది. జగన్ రెడ్డి ముఠా విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి ప్రైవేటు విమానాల్లో విదేశాలకు నల్లధనాన్ని తరలిస్తోందంటూ పట్టాభి తీవ్ర ఆరోపణలు చేయగా, విజయసాయిరెడ్డి కూడా తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పట్టాభి కూడా అదేస్థాయిలో విజయసాయి వ్యాఖ్యలను తిప్పికొట్టారు. 

నువ్వేం మాట్లాడతావో నీకు తెలియదు... ఇలా మాట్లాడే గతంలో మాల్దీవులకు పారిపోవాల్సి వచ్చిందని విజయసాయి ఎద్దేవా చేయగా, నేను పారిపోయే రకం కాదు, పరిగెత్తించే రకం... నిన్ను, నీ ముఠా నాయకుడ్ని చంచలగూడ జైలుకు పరిగెత్తించే వరకు నిద్రపోను అంటూ పట్టాభి బదులిచ్చారు. 

సింగపూర్లో హోటళ్ల వ్యవహారం, స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచిన విషయం, మలేసియాలో వెయ్యి కోట్లు పొగొట్టుకున్న విషయం చంద్రబాబును అడుగు అంటూ విజయసాయి మరో ట్వీట్ చేయగా.... దీనిపైనా పట్టాభి ఘాటుగా స్పందించారు. హోటల్ యజమానిగా లక్షల మందికి స్వచ్ఛమైన భోజనం పెట్టిన చరిత్ర నాది... తప్పుడు లెక్కలు రాసి జైల్లో చిప్పకూడు తిని సీఏ వృత్తికే కళంకం తెచ్చిన చరిత్ర నీది అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. కల్తీ మద్యం సొమ్ము దిగమింగి అడ్డంగా దొరికిపోయి దేహీ అంటూ ఢిల్లీ పెద్దల బూట్లు నాకుతున్నారని ఆరోపించారు.
Pattabhi
Vijayasai Reddy
Twitter
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News