musk: 13 కిలోల బరువు తగ్గిన మస్క్.. సీక్రెట్ ఇదేనంటూ ట్వీట్

Elon Musk Reveals He Lost 13 Kg

  • మరోసారి వార్తల్లో నిలిచిన ట్విట్టర్ బాస్
  • స్నేహితుడి సలహాతో బరువు తగ్గినట్లు వెల్లడి
  • ఇప్పుడు మరింత చురుకుగా ఉన్నానంటూ ట్వీట్
  • అభినందనలు చెబుతున్న ట్విట్టర్ యూజర్లు

ట్విట్టర్ కొనుగోలు చేశాక తరచూ వార్తల్లో నిలుస్తున్న టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ గురించి నెటిజన్లు మరోసారి చర్చించుకుంటున్నారు. అయితే, ఈసారి విమర్శల స్థానంలో మస్క్ పై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. గతంలో కాస్త లావుగా ఉన్న మస్క్ ఇటీవల స్లిమ్ గా, ఫిట్ గా మారడమే దానికి కారణం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ ట్విట్టర్ యూజర్ ‘ఇప్పుడే చాలా ఫిట్ గా కన్పిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. జవాబుగా 13 కిలోల బరువు తగ్గానని మస్క్ ట్వీట్ చేశారు. బరువు ఎలా తగ్గారని మరో యూజర్ ప్రశ్నించగా.. ఆహార నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా అని మస్క్ జవాబిచ్చారు.

ఓ స్నేహితుడి సలహాతో బరువు తగ్గించుకునే ప్రయత్నం చేశానని.. ఇందుకోసం ఆహారాన్ని మితంగా తీసుకోవడంతో పాటు తనకు చాలా ఇష్టమైన ఆహార పదార్థాల జోలికి వెళ్లలేదని మస్క్ చెప్పుకొచ్చారు. వీటితో పాటు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా మందులు తీసుకున్నానని ఎలాన్ మస్క్ చెప్పారు. ఇవన్నీ క్రమపద్ధతిలో పాటించడం ద్వారా బరువు తగ్గానని వివరించారు. బరువు తగ్గాక మరింత చురుకుగా, మరింత ఆరోగ్యంగా ఉంటున్నానని మస్క్ ట్వీట్ చేశారు. కాగా, మస్క్ బరువు తగ్గడంపై ట్విట్టర్ యూజర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

musk
twitter
weight loss
13 kgs
fasting
tasty food
  • Loading...

More Telugu News