Krishna: కృష్ణకి తగిన హీరోయిన్స్ అనిపించుకున్నది వీరే!

- దశాబ్దాల పాటు హీరోగా మెప్పించిన కృష్ణ
- ఆయన సరసన అలరించిన శ్రీదేవి
- అందంతో మరింతగా ఆకట్టుకున్న జయప్రద
- నటనతో కట్టిపడేసిన జయసుధ
- కృష్ణ కెరియర్లో ఈ ముగ్గురి ప్రభావమే ఎక్కువ
తెలుగు తెరపై కృష్ణ కొన్ని దశాబ్దాల పాటు తన జోరును చూపించారు. ఎక్కువగా ఆయన యాక్షన్ జోనర్లోను .. ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లోను సినిమాలను చేస్తూ వెళ్లారు. కథలను ఒప్పుకోవడంలోను .. ఆ ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకుని వెళ్లడంలోను .. రిలీజ్ కి తీసుకుని వెళ్లడంలోను ఎక్కడా జాప్యం జరక్కుండా కృష్ణ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టేవారు. ఆయన నుంచి వరుసగా సినిమాలు వస్తున్నా ఆడియన్స్ బోర్ ఫీలయ్యేవారు కాదు .. అందుకు కారణం ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు.
కృష్ణ తన కెరియర్ ఆరంభంలో వాణిశ్రీ .. కాంచన వంటి హీరోయిన్స్ తో కొన్ని సినిమాలు చేశారు. అందరికంటే ఎక్కువగా ఆయన సరసన విజయ నిర్మల కనిపించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'మీనా' .. 'అల్లూరి సీతారామరాజు' వంటి సూపర్ హిట్లు ఉన్నాయి. ఆ తరువాత తరం కథానాయికలుగా జయసుధ .. జయప్రద .. శ్రీదేవి రంగంలోకి దిగారు. ఇక అప్పటి నుంచి కృష్ణ సరసన నాయికలుగా వారే ఎక్కువ సందడి చేశారు.

